హుజూరాబాద్‌కు తరలిన దళితులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు
పథకానికి అంకురార్పణపై సంబురాలు
పెద్దపల్లి నెట్వర్క్: దళితుల ఆర్థిక సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అంకురార్పణ చేసిన దళితబంధు పథకం సభకు జిల్లా నుంచి దళితులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. పథకంపై ప్రారంభిచండంతో జిల్లావ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు వెల్లువెత్తాయి.
రామగిరి, ఆగస్టు 16: మండలం నుంచి టీఆర్ఎస్ శ్రేణు లు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. వెళ్లిన వారిలో ఏఎంసీ చైర్మన్ పూదరి సత్యనారాయణ, ఆర్బీఎస్ మండల కన్వీనర్ మేదరబోయిన కుమార్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ధర్ముల రాజ సంపత్, పెద్దంపేట సర్పంచ్ నాగరాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు కాపురబోయిన భాస్కర్, ఇబ్రహీం, ఉప సర్పంచుల ఫోరం దామెర శ్రీనివాస్, నాయకులు గాజుల ప్రసాద్, పంజాల శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, ఎల్లా గౌడ్, సైండ్ల తిరుపతి, కృష్ణ, రాజు, గుమ్మడి ప్రసాద్, శివకుమార్ తదితరులు ఉన్నారు.
మంథని టౌన్, ఆగస్టు 16: జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు ఎంపీపీ కొండ శంకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తగరం శంకర్‌లాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ ఆకుల కిరణ్, కౌన్సిలర్లు గర్రెపల్లి సత్యనారాయణ, కుర్రు లింగయ్య, టీఆర్ఎస్ నాయకులు వేల్పుల గట్టయ్య, కొట్టే రమేశ్, సమ్మయ్య, బడికెల నర్సయ్య, మంథని దుర్గమ్మ, లింగయ్య, కల్వల రాజేశంతో పాటు అధిక సంఖ్యలో సభకు తరలి వెళ్లారు.
ధర్మారం, ఆగస్టు 16: వాహన యాత్రను ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకటరెడ్డి, ఏఎంసీ చైర్మన్ గుర్రం మోహన్రెడ్డ్డి జెండా ఊపి ప్రారంభించారు. వెళ్లిన వారిలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంచాల రాజేశం, ప్రధాన కార్యదర్శులు దొనికెని తిరుపతి, దేవి రమణ, విండో వైస్ చైర్మన్ సామంతుల రాజమల్లు, ఏఎంసీ వైస్ చైర్మన్ గూడూరి లక్ష్మణ్, ఆర్బీఎస్ బాధ్యులు పాకాల రాజయ్య, పాక వెంకటేశం, ఎంపీటీసీలు, ఉప సర్పంచుల ఫోరం మండలాధ్యక్షులు మిట్ట తిరుపతి, మంద శ్రీనివాస్, ఎంపీటీసీలు సూరమల్ల శ్రీనివాస్, దాడి సదయ్య, సర్పంచులు తాళ్ల మల్లేశం, చెనెల్లి సాయి, మోర సుధాకర్, రేగుల సదన్ బాబు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ సలామొద్దీన్, ఏఎంసీ, విండో డైరెక్టర్లు భారత స్వామి, బొంగాని తిరుపతి,యూత్ నాయకుడు భైరి సురేశ్, పార్టీ దళిత నేతలు జుంజిపల్లి రమేశ్, గంధం నారాయణ, ఐత వెంకట స్వామి, కాంపల్లి రాజయ్య, కనమండ రమేశ్, కల్లెపల్లి లింగయ్య, సూర వెంకటేశం, కాసిపాక శ్రీనివాస్, శాతరాజుల సుమన్,దేవి నళినీకాంత్,దేవి వంశీ క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఓదెల, ఆగస్టు 16: కొలనూర్, ఓదెల, మడక, బాయమ్మపల్లి, పొత్కపల్లి, జీలకుంటతో పాటు అన్ని గ్రామాల నుంచి ప్రజలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, దళితులు భారీగా తరలివెళ్లారు. వెళ్లిన వారిలో టీఆర్ఎస్ నాయకులు ఆకుల మహేందర్, బండారి ఐలయ్యయాదవ్, ఓదెల నరేందర్, ఢిల్లీ శంకర్, పాకాల సంపత్‌రెడ్డి, దొడ్డె శంకర్, మద్దెల నర్సయ్య, సాత్తూరి రాజేశం, సాత్తూరి రవి ఉన్నారు.
జూలపల్లి, ఆగస్టు 16: మండలం నుంచి పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఇక్కడ సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు దారబోయిన నరసింహం, వైస్ ఎంపీపీ మొగురం రమేశ్, ఎంపీటీసీ సభ్యుల ఫోరం మండలాధ్యక్షుడు దండె వెంకటేశం, కుమ్మరికుంట ఎంపీటీసీ తమ్మడవేని మల్లేశం, పార్టీ మండలాధ్యక్షుడు శాతళ్ల కాంతయ్య, పాటకుల అనిల్, బంటు ఎల్లయ్య, కుంటూరి రాజయ్య, కొత్త రవీందర్, రేశవేని శ్రీనివాస్, కూసుకుంట్ల రాంగోపాల్‌రెడ్డి, సూరిశెట్టి రాజేశం వెళ్లారు.
సుల్తానాబాద్‌రూరల్, ఆగస్టు 16: మండలం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, ఆర్బీఎస్ జిల్లా డైరెక్టర్ పురం ప్రేమ చందర్రావు, ఎంపీటీసీ గట్టు శ్రీనివాస్, గుర్రాల మల్లేశం, టీఆర్ఎస్ నాయకులు పురం రమణ, శ్రీనివాస్ వెళ్లారు.
పెద్దపల్లి రూరల్, ఆగస్టు 16: ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పర్యవేక్షణలో సీఎం సభకు పార్టీ శ్రేణులను తరలించేందుకు బస్సులను సమకూర్చారు. ఎంపీపీ బండారి స్రవంతీ శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి ఆధ్వర్యంలో 1500 మంది వరకు తరలి వెళ్లారు.
ముత్తారం, ఆగస్టు 16: మండలంలోని ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ముందుగా పారుపల్లిలోని అంబేద్కర్ విగ్రహానికి పూల వేసి మాట్లాడారు. వెళ్లిన వారిలో ఎంపీపీ జక్కుల ముత్తయ్య, జడ్పీటీసీ చెలుకల స్వర్ణలతా అశోక్ యాదవ్ తదితరులున్నారు.
కాల్వశ్రీరాంపూర్, ఆగస్టు16: మండలంలోని అన్ని గ్రామాల నుంచి టీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. వాహనాలను ఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొడుగు రాజ్‌కుమార్ ప్రారంభించారు.