జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
రామక్రిష్ణాపూర్‌లో హరితహారం
ముత్తారం, జూలై 5: ప్రతి మొక్క ఎంతో విలువైనదని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. రామక్రిష్ణాపూర్‌లో సోమవారం చేపట్టిన హరిత హారం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉప్పు సుగుణ, ఎంపీపీ జక్కుల ముత్తయ్యతో కలిసి మొక్కను నాటారు. అనంతరం గ్రామంలోని మురుగు కాల్వలను శుభ్రం చేశారు. అనంతరం జడ్పీ చైర్మన్ మాట్లాడారు. పల్లెలను పరిశుభ్రంగా, ఆకుపచ్చగా తీర్చిదిద్దేందుకే పల్లె ప్రగతి అమలు చేస్తున్నదని తెలిపారు. గ్రామంలో నాటిన మొక్కలను రక్షించే బాధ్యత సర్పంచులు తీసుకోవాలని కోరారు. ఇంటితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ అత్తె చంద్రమౌళి, వైస్ ఎంపీపీ సూదాటి రవీందర్రావు, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో వేణుమాధవ్, మాజీ సర్పంచ్ ఉప్పు శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలి
జూలపల్లి, జూలై 5: ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు. కాచాపూర్‌లో పల్లె ప్రగతి-హరితహారం వంద శాతం విజయవం తం చేయాలని కోరుతూ మండలస్థాయి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారం వేస్తే రూ. 5 వందల నుంచి రూ. 5 వేల దాకా జరిమానా చెల్లించాల్సి వస్తుందని గుర్తు చేశారు. ఇంటింటా పండ్లు, కూరగాయలు, పూల మొక్కలు పెంచుకోవాలని సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే గ్రామస్తులకు పండ్లు, పూల మొక్కలు పంపిణీ చేశారు. ఇక్కడ జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, ఏఎంసీ చైర్మన్ కంది చొక్కారెడ్డి, వైస్ ఎంపీపీ మొగురం రమేశ్, సర్పంచులు బంటు ఎల్లయ్య, మాంకాలి తిరుపతి, రేశవేని రాధ, కొత్త శకుంతల, దారబోయిన నరసింహం, వీర్ల మల్లేశం, మేచినేని సంతోశ్‌రావు, పొలవేని వీరయ్య, కుంటూరి రాజయ్య, ఎంపీటీసీ సభ్యులు మారుపాక శ్రీలత, పల్లె స్వరూప, తమ్మడవేని మల్లేశం, ధూళికట్ట సింగిల్ విండో చైర్మన్ పుల్లూరి వేణుగోపాల్‌రావు, మండల ప్రత్యేకాధికారి రంగారెడ్డి, ఎంపీడీవో వేణుగోపాల్‌రావు, ఎంపీవో రమేశ్, ఏపీవో సదానందం తదితరులు పాల్గొన్నారు.