PEDDAPLLY | పెద్దపల్లి: ఉపాద్యాయ వృత్తి నుండి రాష్ట్రపతి పదవీ బాధ్యతలు చేపట్టిన గొప్ప విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమర్ నగర్ చౌరస్తా లో ఏర్పాటు చేసిన భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహన్ని ఆదివారం ఎమ్మెల్యే విజయ చేతులమీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ సర్వేపల్లి రాధా కృష్ణన్ దేశంలో అనేక యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్ గా పని చేసి స్వాతంత్ర్యం అనంతరం అనేక విద్యా సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. అయన పుట్టినరోజున దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారని అలాంటి మహానుభావుని విగ్రహాన్ని పెద్దపల్లిలో ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమాన్ని పెద్దపల్లిలో నివాసం ఉంటున్న ఉపాద్యాయులందరు ఐక్యంగా పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని చేయడం ఆహ్వానించదగిన విషయమని కితాబునిచ్చారు. అలాగే సామజిక సేవలో భాగంగా అయ్యప్ప చౌరస్తాలో పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ ఆధ్వర్యంలో మానస గంగోత్రి వాటర్ ప్లాంట్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాదుల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వేగోళం సత్యనారాయణగౌడ్, మండల విద్యాధికారి సురేందర్ కుమార్, డిసిఈబి సెక్రటరీ హనుమంతు, మూల రాంరెడ్డి, చాట్ల ఆగయ్య, కార్యవర్గ సభ్యులు కేతిపెల్లి మహేందర్ రెడ్డి, తాండవరం రామస్వామి, కర్రె ప్రవీణ్, ఆలుగం కనకయ్య, కట్కూరి కిషన్ రెడ్డి, సంధి సంపత్ రెడ్డి, కర్నె రాజు, మెతుకు తిరుపతి, మునగంటి ఫణిందర్, సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.