కోర్టు చౌరస్తా, జూన్ 9 : తెలంగాణ న్యాయవాదుల సంఘాల ఫెడరేషన్ వరింగ్ ప్రెసిడెంట్‌గా కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ రాజ్‌కుమార్ నియామకమయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో నిర్వహించిన ఫెడరేషన్ సర్వసభ్య సమావేశంలో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఇందులో వరింగ్ ప్రెసిడెంట్‌గా రాజ్ కుమార్‌ను,
రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండాల్రెడ్డిని ఫెడరేషన్ అధ్యక్షుడిగా, నాంపల్లి క్రిమినల్ కోర్ట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజవర్ధన్రెడ్డిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు రాజ్‌కుమార్ తెలిపారు. రాజ్‌కుమార్ ఎన్నికపై పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. న్యాయవాదుల సమస్యల పరిషారానికి కృషి చేయాలని వారు కోరారు.