MLA Vijayaramana Rao | కాల్వ శ్రీరాంపూర్, జూన్ 27 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఎద్దులాపూర్ జాఫర్ ఖాన్ పేట పెద్ద రాత్ పల్లి వెన్నంపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కాల్వ శ్రీరాంపూర్ లో పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు పోసి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. జాఫర్ఖాన్పేట గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని, పెద్దరాతిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె దావఖాన భవనంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు.. కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రం రావడానికి కృషి చేసిన గొప్ప వ్యక్తి మాజీ ఎమ్మెల్యే గిట్ల ముకుంద రెడ్డి అని అన్నారు.
వ్యవసాయ పరిశోధన కేంద్ర అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తామన్నారు. కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అగ్రికల్చర్ బీఎస్సీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. మూడు నెలల సన్న బియ్యం ఒకేసారి అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. పెద్దపల్లి లో బస్సు డిపో పూర్తయితే ప్రతీ గ్రామానికి బస్సు వస్తుందన్నారు. చివరి ఆయకట్టు ప్రాంతాలకు సాగునీరు అందించమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, సింగిల్విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, ఎంపీడీవో పూర్ణచందర్రావు, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.