స్టాల్‌ను తిలకిస్తున్న కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, ఐఎంఏ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎనమల్ల నరేశ్, ప్రముఖ గైనకాలజిస్ట్ విజయలక్ష్మి, నమస్తే తెలంగాణ కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్, బ్యూరో ఇన్చార్జి కే ప్రకాశ్‌రావు
కరీంనగర్ కార్పొరేషన్/ కమాన్‌చౌరస్తా, మార్చి 8 : ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో సందడిగా మారింది. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని కోర్టు చౌరస్తాలో గల రాజరాజేశ్వర కల్యాణ మండపంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ షోను సందర్శించేందుకు మొదటి రోజు శనివారం జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడ వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలిస్తూ వివరాలు తెలుసుకున్నారు. ఇల్లు, ప్లాట్లు కొనుగోలు చేయాలనుకునేవారు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అపార్ట్మెంట్లు, విల్లాలు, వెంచర్లలోని ప్లాట్ల ధరలు, బ్యాంకు రుణాల గురించి ఆరాతీశారు. కాగా ఆదివారం కూడా కొనసాగనుండగా, అధిక సంఖ్యలో సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నది.