MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్లలో తాగునీటి సమస్య నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి.. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
కోరుట్ల పట్టణ ప్రజలకు భవిష్యత్‌లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సూచించారు.
MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, నవంబర్ 5 : కోరుట్ల పట్టణ ప్రజలకు భవిష్యత్‌లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సూచించారు. ఈ సందర్భంగా కోరుట్ల పట్టణ మున్సిపల్ అనుబంధ గ్రామం ఎకిన్ పూర్ శివారులో గల ఎస్సారెస్పీ కెనాల్ నుంచి మత్తడి ద్వారా కోరుట్ల లోని తాళ్ల చెరువుకు అలైన్మెంట్ ద్వారా నీటిని నింపాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. తాళ్ళచెరువు నుంచి నీటిని అయ్యప్ప గుట్ట ఫిల్టర్ బెడ్ కు మళ్ళించి అత్యవసర సమయంలో పట్టణ వాసులకు తాగునీరు అందించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆదేశించారు.
మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఏవైనా అంతరయాలు, కరువు పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో ఈ ప్రత్యామ్నాయ విధానం ద్వారా పట్టణ ప్రజలకు నిరంతరాయంగా తాగునీటిని అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలైన్మెంట్ పనులతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత రైతుల తో ముందస్తుగా చర్చించాలని పేర్కొన్నారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ఎస్సారెస్పీ నీటిని ఉపకాలువ ద్వారా తాళ్ల చెరువులోకి నీటిని మళ్ళించి నింపడం వల్ల భవిష్యత్తులో కోరుట్లలో తాగునీటి సమస్య నివారించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.
మిషన్ భగీరథ మరమ్మత్తు పనుల్లో వేగం పెంచాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. మూడు రోజులుగా పట్టణంలో మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కారంలో అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సూచనలతో వెంటనే స్పందించి పనులు పూర్తి చేసిన అధికారులు నీటి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే వెంట కోరుట్ల ఆర్డిఓ జీవాకర్ రెడ్డి, ఎమ్మార్వో కృష్ణ చైతన్య మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ నిర్మాతకు భారీ నష్టాలు.. అసలు బ్రేక్ ఈవెన్ అన్నా అవుతుందా?
Ala Venkateswar Reddy | కాంగ్రెస్ అసమర్థతతో ఎండిన పంటలు : మాజీ ఎమ్మెల్యే ఆల వేంకటేశ్వర్‌రెడ్డి
IPL: చెన్నై జట్టులోకి ఎస్ఆర్హెచ్ బ్యాటర్.. 7 కోట్లు వదులుకున్న లివింగ్‌స్టోన్
Anjaiah Yadav | ఎండిన పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్.. వీడియో
AP News | ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 30.50 శాతం పోలింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

