Transco-1535 Union | వీణవంక, డిసెంబర్ 24 : తెలంగాణ ట్రాన్స్ కో-1535 యూనియన్ వైస్చర్మన్ గా ఊట్ల ప్రభుదాస్ ఏకగ్రీంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ ట్రాన్స్ కో-1535 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మెట్టు జాషువా ఎన్నికయ్యారు. కాగా మండలంలోని ఎలుబాక గ్రామానికి చెందిన ఊట్ల ప్రభుదాస్ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తన నియామకానికి కృషి చేసిన వ్యవస్థాపక అధ్యక్షుడు వజీర్, రాష్ట్ర నాయకుడు కల్లపు శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర బీవీ జేఏసీ-1535 అధ్యక్షుడు చందర్ సింగ్‌కు ఈ సందర్భంగా ప్రభుదాస్ కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా ఊట్ల ప్రభుదాస్ ప్రస్తుతం రామగుండం సబ్జెస్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుదాస్ తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్ కో-1535 యూనియన్ వైస్ చైర్మన్‌గా ఎంపిక కావడంపట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.