Hanmanthunipeta | పెద్దపల్లి రూరల్, జనవరి 12 : పెద్దపల్లి మండలం హన్మంతునిపేటలో దశాబ్ధాల కాలంగా జరుగుతున్న సమ్మక్క-సారలమ్మ జాతర పోస్టర్ ను సోమవారం జాతర కమిటీ చైర్మన్ పోల్సాని సుధాకర్ రావు ఆధ్వర్యంలో సమీప గ్రామాల సర్పంచులు, జాతర కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 28 నుంచి 31 వరకు వనదేవతలుగా కొలుచుకునే సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు చైర్మన్ పొలుసాని సుధాకర్ రావు, గౌరవ అధ్యక్షుడు కంకటి రవికాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హన్మంతునిపేట సర్పంచ్ మ్యాడగోని శ్రీనివాస్ గౌడ్ , ముత్తారం సర్పంచ్ నల్లగొండ కుమార్ గౌడ్, ఉప సర్పంచ్ మేకల కుమార్ యాదవ్, కమిటీ సభ్యులు, నాయకులు గన్నమనేని తిరుపతి రావు, మాజీ సర్పంచ్ తీగల సదయ్య, మాజీ ఉప సర్పంచ్ బండి సతీష్, పడాల చంద్రయ్య, తీగల సతీష్, గుర్రాల వాసు, మల్లయ్య, ధర్మపురి, ప్రభాకర్ రావు, కందుల సదయ్య, మహేందర్, శ్రీనివాస్, రాయగట్టు తదితరులు పాల్గొన్నారు.