Poster launch | సైదాపూర్ : సైదాపూర్ మండలకేంద్రంలోని కొత్తబస్టాండ్ వద్ద దేశం లో ఆదివాసీలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఈ నెల 24 న వరంగల్లో నిర్వహించే సభ పోస్టర్ను ఆదివాసీ హక్కుల పోరాట సంఘీబావ వేదిక, వివిద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆదివాసీలపై ఆపరేషన్ కాగార్, హత్యాకాండను వెంటనే నిలిపివేయాలని, శాంతి చర్చలు కొనసాగించాలని కాల్పుల విరమణ పాటించాలని కోరారు. ఆదివాసీలకు ప్రజలంతా అండగా ఉండి వారికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల సంఘీభావవేదిక హన్మకొండ-వరంగల్ ఉమ్మడి జిల్లా కో కన్వీనర్ కొత్తూరి ఇంద్రసేన, తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి గొల్లూరి ప్రవీణ్ కుమార్, తెలంగాణ ప్రజాప్రంట్ హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షుడు పెట్టెం కుమారస్వామి, తెలంగాణ ప్రజాఫ్రంట్ కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యుడు కొడిగూటి చేరాలు, తోటి సంఘం జిల్లా అధ్వక్షుడు గుర్రం కుమారస్వామి, నాయకులు షెడమాకి తిరుపతి, షెడమాకి భిక్షపతి, గుర్రం మల్లయ్య, గాదెపాక అశోక్, బత్తుల లక్ష్మీనారాయణ, మారబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.