మెట్పల్లి, డిసెంబర్ 22 : కుళ్లిపోయి దు ర్వాసన వస్తున్న మాంసం.. పాచిపోయిన బిర్యానీ.. కాలం చెల్లిన ఐస్‌క్రీంలు.. బూజ్ పట్టిన ముడిపదార్థాలు.. ఇవీ మెట్‌పల్లిలోని ఓ రెస్టారెంట్లో వడ్డిస్తున్న ఆహార పదార్థా లు! అవును నిజమే! అధికారుల ఆకస్మికదాడుల్లో నాణ్యతలేని ఆహారం అందిస్తున్నట్టు బయటపడింది. అక్కడున్న వారిని విస్తుపోయేలా చేసింది. అధికారుల వివరాల ప్రకా రం.. మెట్పల్లి మున్సిపల్ అధికారులు శు క్ర రం పట్టణంలోని ఆర్బీ రెస్టారెంట్లో ఆకస్మిక దాడులు చేశారు. వంటశాల, రిఫ్రిజిరేటర్లు, ఆహార పదార్థాల నిల్వలను పరిశీలించారు. వినియోగదారులకు అందిస్తున్న ఆహార పదార్థాలను అధికారులు విస్తుపోయారు. కుళ్లిన మాంసం,పాచిపోయిన బి ర్యానీ, కాలం చెల్లిన ఐస్‌క్రీమ్‌లు, బూజు పట్టిన ఇతర ఆహార వంటకాలు.. తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను గుర్తించా రు. దీంతో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చికెన్, మటన్, ఫిష్ నిల్వచేసి మరుసటి రోజు కస్టమర్లకు అందజేసినా, అపరిశుభ్రత, నాణ్యతలేని, కాలంచెల్లిన పదార్థాలను విక్రయించినా మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీ సుకుంటామని హెచ్చరించారు. మొదటి తప్పుగా 10వేలు జరిమానా విధిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, బేకరీలలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతామని, నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కమిషనర్ వెంట శానిటరీ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఆర్ఐ అక్షయ్,సిబ్బంది విష్ణు, ముజీబ్, నర్సయ్య, అశోక్, నరేశ్, నాయక్ పాల్గొన్నారు.