Pollution-free vehicles | పెద్దపల్లి, ఆగస్టు7: కాలుష్యాన్ని తగ్గించేందుకు కాలుష్య రహిత వాహనాల వినియోగంపై దృష్టి సారించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టరేట్లో గురువారం స్త్రీ నిధి ద్వారా మహిళా సంఘ సభ్యురాలుకు ఎలక్ట్రిక్ ఆటో అందజేశారు.
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద స్త్రీ నిధి ద్వారా సెర్ప్ ఆధ్వర్యంలో పెద్దపల్లి మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన గంగభవాని గ్రామాఖ్య సంఘంలోని ధనలక్ష్మి స్వశక్తి సంఘ సభ్యురాలు ఏడెల్లి రజితకు రూ. 3 లక్షలు రుణం మంజూరు చేయగా, ఎలక్టికల్ ఆటో కొనుగోలు చేశారని కలెక్టర్ తెలిపారు. ఇక్కడ డీఆర్డీవో కాళిందిని, జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్, స్త్రీ నిధి ప్రాంతీయ మేనేజర్ దుర్గాప్రసాద్, సెర్ప్, స్త్రీ నిధి సిబ్బంది ఉన్నారు.