Gudumba camp | మెట్పల్లి రూరల్, మే 21: మెట్పల్లి మండలం ఆత్మనగర్ గ్రామ శివారులోని గుడుంబా స్థావరంపై మెట్పల్లి పోలీసులు బుధవారం దాడి చేశారు. మెట్పల్లి ఎస్సై కిరణ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో పది లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోవడంతో పాటు 1500 లీటర్ల బెల్లంపాకాన్ని ధ్వంసం చేశారు. కాగా నిర్వాహకుడు పారిపోగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ దాడిలో పీసీలు విశాల్, ప్రణయ్ పాల్గొన్నారు.