Sircilla | ఎల్లారెడ్డిపేట, అక్టోబర్ 6 : నారాయణపూర్‌కు చెందిన దొమ్మాట కిషన్ ఏజంటు మోసంతో రష్యన్ ఆర్మీలో చిక్కుకోగా తన భర్తను ఇండియాకు తీసుకొచ్చేందుకు సహకరించాలని కిషన్ భార్య రక్షిత బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యను కోరింది. ఆగయ్యను మంగళవారం కలిసి తన భర్తను తీసుకెల్లేటప్పుడు జరిగిన వివరాలను తెలిపింది. రష్యాలో ఉద్యోగమంటూ రూ.2.5లక్షలు తీసుకున్నారని, రష్యన్ ఆర్మీలోకి అని మాత్రం చెప్పలేదని వాపోయింది.
ఆదిత్య మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ ఏజంట్ శ్రీనివాస్ కిషన్‌తో పాటు మరో ముక్కెర రాజ్‌కుమార్, వంగల కోటేశ్వర్రావు, సుప్పన్ స్వామి, పోతరాజు విజయ్‌కృష్ణ, గుజ్జు జగబంధు, మానిక్యాల నరేశ్ రష్యాకు వెల్లినట్లు కిషన్ బంధువులు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో మాట్లాడి తన భర్తను స్వదేశానికి తీసుకొచ్చేందుకు సహకరించాలని రక్షిత, ఆమె బంధువులు ఆగయ్యకు విజ్ఞప్తి చేశారు.