Smart Ration Cards | స్మార్ట్ రేషన్ కార్డుపై నాయకుల ఫొటోలు రాజకీయ ప్రచారమే.. మాజీ సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్
స్మార్ట్ రేషన్ కార్డు పై ముఖ్యమంత్రి, మంత్రులు, రాజకీయ నాయకుల ఫొటోలు ముద్రించడం అంటే రాజకీయ ప్రచారమేనని తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అక్కనపల్లి కరుణాకర్ విమర్శించారు.
- కష్టపడే రైతు చిత్రం ముద్రించాలని డిమాండ్
Smart Ration Cards | బోయినపల్లి రూరల్, ఆగస్టు 28 : స్మార్ట్ రేషన్ కార్డు పై ముఖ్యమంత్రి, మంత్రులు, రాజకీయ నాయకుల ఫొటోలు ముద్రించడం అంటే రాజకీయ ప్రచారమేనని తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అక్కనపల్లి కరుణాకర్ విమర్శించారు. బోయినపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరుణాకర్ మాట్లాడారు. రేషన్ కార్డు ప్రజల హక్కు అని, ఏ ఒక్క పార్టీ లేదా నాయకుడు వ్యక్తిగతంగా ఇచ్చిన కానుక కాదన్నారు.
ప్రభుత్వాలు శాశ్వత కాదనీ, ప్రభుత్వం మారిన ప్రతీసారీ ఫొటోలు మార్చి కొత్త కార్డులు ముద్రిస్తే కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతుందని మండిపడ్డారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చినప్పటికీ వాటిపై రాజకీయ నాయకుల ఫొటోలను ప్రచారం కోసం ముద్రించలేదన్నారు. రైతే రాజు అని మాటల్లో చెప్పడం కాదు రైతు కష్టాన్ని గుర్తించే విధంగా రేషన్ కార్డుపై రైతు చిత్రం ముద్రించి గౌరవమివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుంటి శంకర్, బత్తిని కమల్ గౌడ్, కన్నం సాగర్, కట్ట లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

