Godavarikhani | రామగుండం 54వ డివిజన్ లో పైపులైన్ల లీకేజీ.. నివారణ చర్యల జాడేది.. వృథాగా భగీరథ నీరు
రామగుండం నగర పాలక సంస్థ 54వ డివిజన్ పరిధిలోని పరశురాంనగర్ బోర్డు నుంచి తిలక్ నగర్ సెంటర్ వరకు బుధవారం మిషన్ భగీరథ నీరు రోడ్లపై వృథాగా పోతున్నది.
Godavarikhani | కోల్ సిటీ, నవంబర్ 11 : రామగుండం నగర పాలక సంస్థ 54వ డివిజన్ పరిధిలోని పరశురాంనగర్ బోర్డు నుంచి తిలక్ నగర్ సెంటర్ వరకు బుధవారం మిషన్ భగీరథ నీరు రోడ్లపై వృథాగా పోతున్నది. పలు చోట్ల పైపులైను లీకేజీలు ఏర్పడటంతో ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తున్నది. నగర పాలక అధికారుల పర్యవేక్షణ కొరవడటం, సిబ్బంది నిర్లక్ష్యం వెరసి తరచుగా పైపులైన్ల లీకేజీలు సంభవిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పరశురాంనగర్ నుంచి తిలక్ నగర్ వరకు ప్రధాన రోడ్డు వెంట సుమారు ఐదారు చోట్ల పైపులైను లీకేజీలు ఏర్పడినా ఎవరు పట్టించుకోవడం లేదని వాపోయారు.
లీకేజీలతో తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ముర్మూరు పంప్ హౌస్ వద్ద సాంకేతిక లోపం కారణంగా నగరంలో రెండు రోజుల పాటు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. బుధవారం నుంచి నీటి సరఫరా పునరుద్ధరణ జరగగా, పలు ప్రాంతాల్లో పైపులైన్లు లీకేజీలు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలు డివిజన్లలో ప్రజలు తాగునీటి సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ఎల్ ని నో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి సమస్య మరింత జఠిలంగా మారుతుందనీ, ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవడం అలవర్చుకోవాలంటూ అధికార యంత్రాంగం ఆర్భాట ప్రచారం చేస్తుండగా, నగర పాలక పరిధిలో భిన్నమైన పరిస్థితి ఉంది. మంచినీటి పైపులైన్ల లీకేజీలను అరికట్టడంలో ఎందుకు అశ్రద్ధ వహిస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే లేకేజీ లను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ను కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నిరుపేద విద్యార్థులకు ఫీజుల చెల్లింపు అభినందనీయం’
‘సీతారామ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కాల్వలు వెంటనే నిర్మించాలి’
Priya Bhavani Shankar | వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నటి ప్రియా భవానీ శంకర్.. ప్రియుడితో అంగరంగ వైభవంగా వివాహం!
Man Kills Wife, Strips Body | భార్యను హత్య చేసి దుస్తులు తొలగించిన భర్త.. హత్యాచారంగా నమ్మించేందుకు యత్నం
Ramayana | థాయ్‌లాండ్‌లో రూ.5 కోట్లు.. ఇండోనేషియాలో దూసుకుపోతున్న ‘రామాయణం’!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

