‘సీతారామ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కాల్వలు వెంటనే నిర్మించాలి’
సీతారామ ప్రాజెక్టు కెనాల్ కాలువలకు లింక్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కాలువలు వెంటనే నిర్మించి జిల్లా రైతాంగానికి సాగు నీరు అందించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు. బుధవారం ములకలపల్లి మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో...
– సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య డిమాండ్
ములకలపల్లి, నవంబర్ 11 : సీతారామ ప్రాజెక్టు కెనాల్ కాలువలకు లింక్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కాలువలు వెంటనే నిర్మించి జిల్లా రైతాంగానికి సాగు నీరు అందించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు. బుధవారం ములకలపల్లి మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో పోడియం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోరాటాల గడ్డ నల్లగొండలో ఈ నెల 15 నుండి 18వ తేదీ వరకు అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహా సభలు జరుగనున్నాయని, మొదటి రోజు లక్షల మందితో జరిగే భారీ బహిరంగ సభలో రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా నల్లగొండ సభకు వేలాదిగా కదిలి రావాలని పిలుపునిచ్చారు. దేశంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతుందని విమర్శించారు.
రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక దేశంలోని రైతాంగం తీవ్రంగా నష్టపోతుందన్నారు. ఈ రోజు దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆర్థికంగా చితికి పోయి తెచ్చిన అప్పులు తీర్చలేక అప్పుల బాధలు భరించలేక కొందరు రైతులు హత్మహత్యల పాలవుతున్నారన్నారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఎరువులు, విత్తనాలను సబ్సిడీ ద్వారా అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, మాలోతు రావూజ, నిమ్మల మధు, గుగులోతు దేవేందర్, వర్షా శ్రీరాములు, బైరు ప్రసాద్, కుంజా రాంమూర్తి, గోపగాని లక్ష్మీ నరసయ్య, గుగులోతు రవీందర్, కోండ్రు రాఘవయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, మడకం మల్లేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సీతారామ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కాల్వలు వెంటనే నిర్మించాలి’
Priya Bhavani Shankar | వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నటి ప్రియా భవానీ శంకర్.. ప్రియుడితో అంగరంగ వైభవంగా వివాహం!
Man Kills Wife, Strips Body | భార్యను హత్య చేసి దుస్తులు తొలగించిన భర్త.. హత్యాచారంగా నమ్మించేందుకు యత్నం
Ramayana | థాయ్‌లాండ్‌లో రూ.5 కోట్లు.. ఇండోనేషియాలో దూసుకుపోతున్న ‘రామాయణం’!
ఐఎన్ఎస్ కేసరి.. ఉభయచర యుద్ధ నౌక
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

