Vimalakka | ధర్మారం, జనవరి 31 : యువ చైతన్యంలో పీపుల్స్ యూత్ అసోసియేషన్ ఎంతో ఆదర్శంగా ఆ విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని అరుణోదయ సాంస్కృతిక మండలి గాయని విమలక్క, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీం సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన క్రీడా శిక్షకుడు మేకల సంజీవరావు సామాజిక సేవ, యువ చైతన్యం ధ్యేయంగా పీపుల్స్ యువసేన యూత్ అసోసియేషన్ పేరిట ఇటీవల రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాన్ని శనివారం హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లిలో అరుణోదయ మండలి గాయని విమలక్క ఆవిష్కరించారు.
అదేవిధంగా అసోసియేషన్ కార్యక్రమం విస్తృత ప్రచారం కోసం ఇన్ ఇన్స్టాగ్రామ్ ను ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాయని విమలక్క, ప్రొఫెసర్ ఖాసీం వేరువేరుగా మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత పాత్ర ఎంతో ఉందని యువతను చైతన్యం చేయడంలో యూత్ అసోసియేషన్ కృషి చేయాలని అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవరావుకు వారు సూచించారు.
యువత చెడు మార్గంలో పయనించకుండా ఉన్నత చదువులు చదువుకొని ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించాలని వారు పేర్కొన్నారు. యువ చైతన్యం కోసం యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని దీనిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేయాలని వారు సూచించారు.