Seasonal Diseases | రాయికల్, జులై 3 : వర్షాకాలంలో ప్రభలే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. రాయికల్ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ, ఐపీ సేవలు రికార్డ్స్,ల్యాబ్ రికార్డ్స్,ఐపీ రికార్డ్స్, మందులను ఆయన పరిశీలించారు.
ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి నేరుగా పేషంట్లని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు మెరుగు పరచాలని, డాక్టర్లు సమయ పాలన పాటించాలనీ అధికారులను ఆదేశించారు. ఓపీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్ పేషెంట్ రోగులకు డైట్ ఫుడ్, పాలు, ఇడ్లీ బ్రెడ్, ఫ్రూట్స్ పోషక ఆహార పదార్థాలు అందించాలని ఆదేశించారు. ముందస్తు వర్షాకాలం సీజనల్ వ్యాధులు పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
అలాగే మండలంలోని ఇటిక్యాల, బోర్నపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న హెల్త్ సబ్ సెంటర్ లను కలెక్టర్ పరిశీలించారు. హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం బోర్నపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని సమస్యలను ఉపాధ్యాయులు విద్యార్థులు ఉండి అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని, మధ్యాహ్న భోజనాన్ని గ్యాస్ స్టవ్ పైనే వండాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణ, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, సిబ్బంది సంబంధిత అధికారులు పాల్గొన్నారు.