Collector Satya Prasad | భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్ సత్యప్రసాద్
భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని రేచపల్లి గ్రామంలోని ఊర చెరువు మత్తడిని శనివారం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. రేచపల్లి ఊర చెరువు కట్టపై నుండే బీంరెడ్డి గూడెం గ్రామానికి గిరిజనులు వెళ్తుంటారు.
- చెరువుల వద్ద రీల్స్ చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
Collector Satya Prasad | సారంగాపూర్, ఆగస్టు 16: భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని రేచపల్లి గ్రామంలోని ఊర చెరువు మత్తడిని శనివారం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. రేచపల్లి ఊర చెరువు కట్టపై నుండే బీంరెడ్డి గూడెం గ్రామానికి గిరిజనులు వెళ్తుంటారు. చెరువు కట్ట మత్తడి దుంకితే గూడెం వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోతాయి.
రాత్రి నుండి భారీ వర్షం కురడంతో చెరువు పూర్తిగా నిండిపోయి మత్తడి వరకు నీళ్లు చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్ చెరువును, మత్తడిని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరువులోకి ఎవరు వెళ్లవద్దని, చెరువు వద్ద ఎవరిని రీల్స్ చేయకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. నీటి ప్రవాహం పెరిగితే అవసరమైతై పోలీసులను బందోబస్త్ ఏర్పాటు చేయించాలని ఆదేశించారు.
గ్రామస్తులు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరు కూడా నీటి ప్రవాహం ఉన్న చెరువులోకి వెళ్లవద్దని చెప్పారు. ప్రాణ నష్టం జరుగకుండా చూడాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, తహసీల్దార్ వహిదొద్దిన్, ఎంపీడీవో చౌడారపు గంగాధర్, ఎస్ఐ గీత, ఆర్ఐ వెంకటేష్, కార్యదర్శి సంతోష్, మాజీ ప్రజాప్రతినిధులు ఎడమల జయలక్ష్మారెడ్డి, బేర మహేష్, కారోబర్ రంజిత్, ఆయా శాఖల అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

