Thimmapur | తిమ్మాపూర్, అక్టోబర్ 8 : అవినీతి ఆరోపణల నేపథ్యంలో తిమ్మాపూర్ సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ లను సస్పెండ్ చేసిన సీపీ గౌస్ ఆలం చిత్రపటానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి నాయకులతో కలిసి తిమ్మాపూర్ లో పాలాభిషేకం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ సమీపంలో పటాకులు కాల్చి సంబరాలు జరిపారు. స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి పక్షపాతం చూపెట్టకుండా ఎమ్మెల్యేకు భయపడకుండా అవినీతిని పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేయడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాశం అశోక్ రెడ్డి, నాయిని వెంకట్ రెడ్డి, గడ్డి రమేష్, మాశెట్టి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.