karimnagar | కలెక్టరేట్, ఏప్రిల్ 3 : పెన్షనర్ల పౌర సేవల సవరణ (సీసీఎస్) బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, గాన ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ రిటైర్డ్ పర్సన్స్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ, నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్ అసోసియేషన్ పిలుపుమేరకు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం బిఎస్ ఎన్ ఎల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు వి.చక్రపాణి మాట్లాడుతూ జీవితాన్ని ధారబోసి పెన్షనర్స్ కు విజయాన్ని సాధించిపెట్టిన డిఎస్ నకార ఆశయానికి, పెన్షనర్స్ హక్కులకు భంగం కలిగే విధంగా కేంద్రం ఈ చట్టాన్ని తేవడం గర్హనీయమన్నారు. 2026 జనవరికి ముందు పదవీ విరమణ పొందిన పెన్షనర్స్ కు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు అందకుండా, 8వ వేతన సవరణలో పొందుపరిచేందుకు కుట్ర పన్నడాన్ని, దేశంలోని అన్ని పెన్షనర్ సంఘాలు తీవ్రంగా ఖండించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వము సీసీఎస్ బిల్లును వెంటనే రద్దు చేస్తూ, పాత విధానం కొనసాగించేటట్టుగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీసీఎస్ విధానాన్ని రద్దు పరిచేదాకా ఐక్య ఉద్యమాలు చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టాప్ర జిల్లా అధ్యక్షుడు సీహెచ్.జనార్దన్, సంఘం ప్రతినిధులు గడ్డం అశోక్, కట్ట నాగభూషణాచారి, మోకిలా రాజేందర్, దామెర మల్లయ్య, పుల్లెల మల్లయ్య, వి సత్యనారాయణ రావు. ఎం లక్ష్మీపతి, వి శ్రీనివాస్ రెడ్డి, ఎం రాజయ్య, సిహెచ్ శ్రీనివాస్ గౌడ్, వి రాజేశం, సిహెచ్ దామోదర్, కే చంద్రమౌళి, వి రమణ, పి సీతారామారావు, వై చంద్రమౌళి, జి లక్ష్మీనారాయణ, జి రాజమౌళి, డి.మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.