పెద్దపల్లి కమాన్, సెప్టెంబర్ 4: యువ కళాకారుడు కేలం అజయ్ రామ్ (Ajay Ram) తన చిత్రకళ ప్రతిభతో అబ్బురపరుస్తున్నాడు. కమన్ పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన అతడు భారీ గణనాథుడి బొమ్మను అచ్చుగుద్దినట్టు గీసి తన ప్రత్యేకత చాటుకున్నాడు. ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో ప్రతిష్టించిన భారీ మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
గురువారం జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఆ భారీ వినాయకుడి ప్రతిమను చూస్తూ.. సుమారు రెండు గంటలపాటు శ్రమించి కాన్వాసుపై బొమ్మగా వేశాడు అజయ్ రామ్. పెయింటింగ్‌ను హాబీగా మార్చుకున్న అజయ్ తన కళా నైపుణ్యంతో అద్భుతమైన చిత్రాన్ని గీసి పలువురి మన్ననలు పొందాడు. గణేశ్ నవరాత్రుల వేళ తన చిత్రకళ ప్రతిభను కనబరిచిన అజయ్‌ను ఛత్రపతి యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు శివంగారి సతీష్ శాలువా కప్పి సన్మానించారు.