సుల్తానాబాద్ రూరల్, ఏప్రిల్ 24: ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ను మహిళలు సద్విని చేసుకోవాలని గట్టేపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ అన్నారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ (Sultanabad) మండలంలోని బీగట్టేపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని పాఠశాల హెచ్ఎం అనురాధ చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా హెచ్ఎం అనురాధ, సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ ధనలక్ష్మి మాట్లాడుతూ.. 50 శాతం సబ్సిడీపై కుట్టు మిషిన్లను అందిస్తున్నామన్నారు. ట్రైనింగ్ అనంతరం శిక్షణ తీసుకున్న వారికి సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు దామోదర్ రావు, అరుణ జ్యోతి పెద్దన్న, కోడి కనకయ్యా, రాజమౌళి, మాజీ ఎంపీటీసీ శీలం శంకర్, స్కూల్ చైర్మన్ కళ్యాణి, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం విజేందర్, అంగన్వాడి టీచర్ ఎలీషా నాయకులు బండారి లక్ష్మన్, మండల వాలంటీర్ ట్రైనర్ బండారి మమత తో పాటు మహిళలు పాల్గొన్నారు.