Begumpet High school | పదవ తరగతి పరీక్షల్లో మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బేగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అపూర్వ ప్రోత్సాహం అందించారు. పాఠశాలలో చదివిన ఇద్దరు విద్యార్థులు – పాగల రసీత (558 మార్కులు), శ్రీమంతులు లోహిత (557 మార్కులు) అత్యధిక మార్కులు సాధించి మండల టాపర్లుగా నిలిచారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్కా రాంకిషన్ రావు తన సొంత ఖర్చులతో ఆ ఇద్దరు విద్యార్థులను ఆదివారం విమానంలో వైజాగ్ తీసుకెళ్లారు. అక్కడ వారికి వివిధ పర్యాటక ప్రాంతాలను చూపించనున్నట్లు ఆయన తెలిపారు.
తమ గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అందిస్తూ, పదవ తరగతిలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయుడి చర్యను బేగంపేట గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రాంకిషన్ రావును గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహించడం అభినందనీయమని వారు కొనియాడారు.
Begumpet Prinicipal