Monkey | పెద్దపల్లి జిల్లాలో కోతుల బీభత్సం.. ఇంటి ముందు పనులు చేస్తున్న మహిళపై దాడి
Monkey | పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూర్లో శనివారం తెల్లవారుజామున కోతులు బీభత్సం సృష్టించాయి. ఇంటి ముందు పనులు చేసుకుంటున్న మహిళపై దాడి చేశాయి.
Monkey | పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూర్లో శనివారం తెల్లవారుజామున కోతులు బీభత్సం సృష్టించాయి. ఇంటి ముందు పనులు చేసుకుంటున్న మహిళపై దాడి చేశాయి.
పెద్ద బొంకూర్ గ్రామానికి చెందిన కలవేర్గు శ్రీనివాస్ భార్య కమల అనే మహిళ శనివారం ఉదయం ఇంటి ముందు పనులు చేసుకుంటున్న సమయంలో కోతులు ఒక్కసారిగా మీద ఎగబడి నానా బీభత్సం సృష్టించాయి. కోతుల దాడిలో కమల గాయపడటంతో స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. కోతుల వల్ల ఇంటి వద్ద కూడా తమకు భద్రత లేకుండా పోయిందని వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి, ఈ కోతుల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Local news
- monkey
- Peddapalli
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

