MLA Vijaya Ramana Rao | మల్లన్న ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తం : ఎమ్మెల్యే విజయ రమణారావు
పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు కమిటీని ఎమ్మెల్యే విజయ రమణారావు గురువారం అభినందించారు.
ఓదెల, జూలై 31 : పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు కమిటీని ఎమ్మెల్యే విజయ రమణారావు గురువారం అభినందించారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ఓదెల మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి తాజాగా కొత్త పాలకవర్గాన్ని నియమించింది. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యేను తన నివాసంలో కలిశారు. ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, నూతన పాలకవర్గాన్ని ఎమ్మెల్యే శాలువాలు కప్పి సన్మానం చేసి అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాకు ప్రసిద్ధి చెందిన ఓదెల మల్లన్న ఆలయం రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలుస్తోందని చెప్పారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. పాలకవర్గ సభ్యులు సేవా భావంతో పనిచేస్తూ ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులతో పాటు ఓదెల, సుల్తానాబాద్ మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు, జిల్లా పద్మశాలి సేవ సంఘం నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

