ఓదెల, ఆగస్టు 12 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గోపరపల్లి గ్రామంలో ముఖ్యమైన ప్రాంతాలు, కార్యాలయాలు తెలిపే విధంగా నేమ్ బోర్డులను బుధవారం సర్పంచ్ మద్దేవేని రవి యాదవ్ ఏర్పాటు చేయించారు. గ్రామ ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా వివిధ ప్రాంతాల్లో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలోకి వచ్చే ప్రజలు, సందర్శకులు, అత్యవసర సేవలకు మార్గదర్శకంగా ఈ బోర్డులు ఉపయోగపడనున్నాయి. గ్రామంలోని ముఖ్యమైన ప్రాంతాలు, వీధులు ప్రజా సౌకర్యాల గుర్తింపుకు ఈ నేమ్ బోర్డులు ఎంతో దోహదపడతాయని తెలిపారు.
గ్రామ అభివృద్ధి, సౌకర్యాల మెరుగుదల ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యమని సర్పంచ్ పేర్కొన్నారు. గోపరపల్లిని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వన్నెపురెడ్డి అనిల్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.