Harvester | కాల్వ శ్రీరాంపూర్ ఏప్రిల్ 14. టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి తాటివనం వద్ద సోమవారం సాయంత్రం 4 గంటలకు హార్వెస్టర్ ఢీకొని దాసరి కనకమ్మ(55) అనే మహిళా కూలి మృతి చెందింగా మరో మహిళ రాగుల వసంత కి కాలు విరిగి తీవ్రగాయాల పాలవడంతో స్థానికులు ఆ మహిళను చిట్యాల ఆసుపత్రికి తరలించారు.
స్థానికులు, తోటి కూలీల కథనం ప్రకారం.. పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన మహిళా కూలీలు ఆటోలో టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి లో మేల్ ఫిమేల్ వరిలో బెరుకులు తీసేందుకు వెళ్లారు. కూలీల ఆటో ముందు హార్వెస్టర్ డ్రైవర్ పాటలు పెట్టుకొని హర్వెస్టర్ ను నడుపుకుంటూ వెళ్తున్నాడు. కాగా ఎదురుగా వెంకట్రావుపల్లె నుంచి బస్సు ఎదురుగా వస్తుంది.
దీంతో హార్వెస్టర్ ని డ్రైవర్ వెనక్కి తీస్తున్న క్రమంలో కూలీలు మొత్తుకుంటూ పక్కకు వెళ్లారు. ఈ క్రమంలో డ్రైవర్‌కు పాటల సౌండ్ తో వినపడకపోవడంతో వారి పై నుంచి హార్వెస్టర్ దాసరి కనకమ్మ (55), రాగుల వసంతపై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో కనకమ్మ మృతి చెందింది. కాగా వసంతకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హార్వెస్టర్ డ్రైవర్ అక్కడి నుండి పరారైనట్లు కూలీలు తెలిపారు. డ్రైవర్ నిర్లక్షమే ప్రమాదానికి కారణమని కూలీలు వాపోయారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.