పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధర అమాంతం పడిపోయింది. నిన్న మొన్నటి వరకు క్వింటాలకు రూ. 7వేల వరకు ధర పలికిన పత్తి గురువారం కేవలం రూ. 5వేలకే అమ్ముడు పోయింది. నిన్న అమావాస్య కావటంతో క్రయ విక్రయాలు జరగ లేదు. ఈ రోజు దాదాపుగా 1500క్వింటాళ్ళ పత్తి రావటం తో ఒక్కసారి రూ. 2వేలు తగ్గించారని రైతులు మండి పడుతున్నారు.
Peddapalli Marketyard2
ఈ సీజన్ లో ఈ రోజు ఎక్కువ పత్తి రావటంతో అదును చూసి ధర తగ్గించారని రైతులు ఆరోపించారు. పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, మార్కెట్ కమిటీ సిబ్బంది, అడితీ దారులు మొత్తం కుమ్మకై నిలువునా ముంచుతున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. తమ దగ్గర తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసి సీసీఐకి ఎక్కువ ధరకు అధికారులు అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపించారు.