రెబ్బెన, జనవరి 2 : బెల్లంపల్లి ఏరియాకు సంస్థ నిర్దేశించిన వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సమష్టి కృషితో అధిగమిస్తామని జీఎం దేవేందర్ అన్నారు. ఏరియాలోని గోలేటి జీఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో డిసెంబర్‌కు సంబంధించిన బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలు వెల్లడించారు. గనులు 3.50 లక్షల టన్నులకు గానూ 2.83 లక్షల టన్నులు (81శాతం) ఉత్పత్తి సాధించినట్లు చెప్పారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. గోలేటి ఓసీపీ ప్రారంభానికి అన్ని చర్యలు తీసుకుంటామని, మే లేదా జూన్‌లో ఉత్పత్తి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఎంవీకే ఓసీపీ ప్రారంభ పనులు చురుగ్గా కొనసాగుతున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏరియా ఎస్వోటూ జీఎం గుప్తా, డీజీఎం(ఐఈడీ) ఉజ్వల్ కుమార్ బెహరా, పర్సనల్ మేనేజర్ ఐ లక్ష్మణ్‌రావు, డీవైపీఎం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ఆర్జీ-2లో 108 శాతం ఉత్పత్తి ..
యైటింక్లయిన్ కాలనీ, జనవరి 2 : ఆర్జీ-2 డివిజన్లో డిసెంబర్లో 108 శాతం బొగ్గు ఉత్పత్తి అయినట్లు జీఎం ఐత మనోహర్ వెల్లడించారు. కాన్ఫరెన్స్ హాల్లో ఏరియాలోని భూగర్భ గనులు, ఓసీపీల్లో డిసెంబర్లో సాధించిన ఉత్పత్తి వివరాలను సోమవారం వెల్లడించారు. డివిజన్లో 7,56,600 టన్నుల బొగ్గు ఉత్పత్తికి గానూ 8,18,700 టన్నులు వెలికి తీసి 108 శాతానికి చేరుకోగా, ఉద్యోగులను అభినందించారు. ఓసీపీ-3లో 7,25,000 టన్నుల లక్ష్యానికిగానూ 7,72,800 టన్నులు వెలికి తీసి 107 శాతం, వకీలుపల్లి గనిలో 31,600 టన్నుల బొగ్గు ఉత్పత్తికిగానూ 45,900 టన్నులు తీసి 145 శాతానికి చేరుకున్నట్లు వివరించారు. అలాగే ఓబీ 48,05,600 క్యూబిక్ మీటర్లకుగానూ 47,76,300 క్యూబిక్ మీటర్లు తీసి 99శాతం సాధించిందన్నారు. సీహెచ్‌పీ నుంచి 8,52,400 టన్నుల బొగ్గును రైలు ద్వారా రవాణా చేశామని జీఎం తెలిపారు. యంత్రాలను రోజూ 18 గంటలకు పైగా వినియోగించి నాణ్యమైన బొగ్గును వెలికి తీయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. అనంతరం ఉద్యోగులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో ఎస్వోటూ జీఎం అబ్దుల్ సలీం, పీవో జీ మోహన్ రెడ్డి, డీజీఎం(పా) జీ రాజేంద్రప్రసాద్, డీజీఎం(ఐఈడీ) మురళీకృష్ణ, సివిల్ డీజీఎం ధనుంజయ, డీజీఎం(స్టోర్స్) సృజన్మోహ్ర, ఫైనాన్స్ మేనేజర్ ధనలక్ష్మీబాయి, పర్యావరణ అధికారి రాజారెడ్డి, ఈఈ (ఏ) రాంరెడ్డి, డాక్టర్ మహిపాల్, సీనియర్ పీవో మండల శ్రీనివాస్, కోఆర్డినేటర్ బీ దేవారెడ్డి తదితరులు పాల్గొన్నారు.