మల్లాపూర్ జులై 22: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామంలో నూతనంగా విద్యుత్ సబ్ స్టేషన్ ను మంజూరు చేయాలని కోరుతూమంత్రి శ్రీధర్ బాబుకు స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు దామ రాజేష్ మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ గ్రామంలో ఎక్కువ జనాభా ఉన్నారని, రైతులు, విద్యుత్ వినియోగదారుల దృష్ట్యా ప్రత్యేకంగా తమకు నూతనంగా సబ్ స్టేషన్ ను మంజూరు చేయాలని కోరారు. ఆయన వెంట టీ పీసీసీ డెలిగేట్ సభ్యుడు కల్వకుంట్ల సుజిత్ రావు, కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి, మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, నాయకులు వంగ అశోక్, రాజం, మహబూబ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.