జూలపల్లి, ఆగస్టు 22: మండల కేంద్రానికి చెందిన ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు పాటకుల మహిపాల్ అనారోగ్యంతో బాధపడుతుండగా, పెద్దాపూర్ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు గొట్టెముక్కుల సురేశ్‌రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో ‘జీఎస్ఆర్’ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు సురేశ్‌రెడ్డి తన అనుచరుల ద్వారా ఆర్థికసాయంగా రూ. 20 వేలు పంపించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ్ సామల కిరణ్ చేతుల మీదుగా నగదు అం దజేశారు. సురేశ్‌రెడ్డికి మహిపాల్, అతడి కుటుం బ సభ్యులు, ఆర్ఎస్ఎస్ సంస్థ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ సంస్థ సభ్యులు తీగల అశోక్, కల్లెపెల్లి అంజి, ఉప్పుల శ్రీకాంత్, గంగిపెల్లి విద్యాసాగర్, కొండ సందీప్, మేర్గు కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
నిత్యావసరాల అందజేత
సుల్తానాబాద్, ఆగస్టు 22 : డయాలసిస్‌తో బాధపడుతున్న రోగికి ‘మైనంపల్లి సోషల్ సర్వీసెస్’ ద్వారా నిత్యావసరాలను ఆదివారం అందజేశారు. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన ఈదునూరి పద్మ కొంతకాలంగా కిడ్నీ సమస్యతో డయాలసిస్ చేయించుకుంటున్నది. వారి సమస్యను ఆమె కుమారుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కొడుకు రోహిత్ దృష్టికి తీసుకెళ్లాడు. అతడు వెంటనే స్పందించి ‘మైనంపల్లి సోషల్ సర్వీసెస్’ ద్వారా నిత్యావసరాలను పం పించగా,సుల్తానాబాద్ మీడియా మిత్రులు పద్మకు అందజేశారు. పద్మ కుటుంబ సభ్యులు మైనంపల్లికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పెగడ చందు, న్యాతరి శ్రీనివాస్, మేరుగు యాదగిరి, ఆకుల కరుణాకర్, యెల్లె శివ, శ్రీగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
లారీ డ్రైవర్‌కు సాయం
కోల్‌సిటీ, ఆగస్టు 22: గోదావరిఖని నగరంలోని 8వ డివిజన్‌కు చెందిన నిరుపేద లారీ డ్రైవర్ మమతగిరి సతీశ్‌కు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేశ్ ఆదివారం ఆర్థిక సహా యం అందించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచాన పడి కుటుంబాన్ని పోషించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సతీశ్ పరిస్థితి తెలుసుకొని అతడిని పరామర్శిం చారు. ఈ సందర్భంగా దినేశ్ మాట్లాడుతూ, భార్య, ఇద్దరు ఆడపిల్లలతో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతు న్నాడని, తిండిలేని పరిస్థితుల్లో ఉన్నాడన్నారు. సతీశ్ కుటుంబాన్ని మానవతా వాదులు ఆదుకోవాలని దినేశ్ కోరారు.