జోరుగా హరితహారం, పారిశుధ్య కార్యక్రమాలు
ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, కలెక్టర్, అదనపు కలెక్టర్ హాజరు
పెద్దపల్లి, జూలై 4(నమస్తే తెలంగాణ): పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా పండుగలా కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పర్యటించి లాంఛనంగా మొక్కలు నాటడంతో హరితహారం ఊపందుకుంది. జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ, స్థానిక సంస్థలు, అటవీ శాఖల ఆధ్వర్యంలో 52వేల మొక్కలను నాటారు.
పారిశుధ్య చర్యలు చేపట్టాలి
మంథని రూరల్, జూలై 4: గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ సూచించారు. సూరయ్యపల్లిలో పల్లె ప్రగతి కార్యక్రమా న్ని ఆదివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, రైతు వేదిక భవనాన్ని ఆమె సందర్శించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. తడి, పొడి చెత్తను పంచాయతీ ట్రాక్టర్ ద్వారా సేకరించి డంప్‌యార్డుకు తరలించాలని, అన్ని వీధుల్లో మొ క్కలు నాటాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో శ్రీనివాస్, తహసీల్దార్ ప్రకాశ్, ఎంపీడీవో జగదీశ్వర్‌రావు, సర్పంచ్ భీముని పుష్ప వెంకటస్వామి, ఎంపీవో శేషయ్య, ఏపీవో సదానందం, ఎంపీటీసీ చెరుకుతోట ఓదెలు, ఉప సర్పంచ్ మాదాటి రాజిరెడ్డి పాల్గొన్నారు.
పల్లెలు మెరిసి పోవాలి
ధర్మారం, జూలై 4: పల్లె ప్రగతిలో భాగంగా పల్లెలు మెరిసి పోవాలని అధికారులు, సర్పంచులకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. ఈ మేరకు ఖిలావనపర్తి, బొట్లవనపర్తి, ధర్మారంలో ఎంపీడీవో జయశీలతో కలిసి ఆదివారం ఆయన పర్యటించి, పనులను పరిశీలించారు. బొట్లవనపర్తిలో ఆర్అండ్బీ రోడ్డు పక్కన అంబేద్కర్ విగ్రహ సమీపాన హరిత హారంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రత్యేక పారిశుధ్య చర్యలు, హరిత హారంలో మొక్కల నాటేందుకు ఈ నెల 1 నుంచి 10వ తేదీ దాకా ప్రభుత్వం ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీవో చిరంజీవి, సర్పంచులు సాగంటి తార, రెడపాక ప్రమీల, పూస్కూరు జితేందర్‌రావు, ఉప సర్పంచులు కీసర స్వరూపారాణి, మోటపలుకుల సత్యనారాయణ, ఆవుల లత పాల్గొన్నారు.
చెత్త తొలగింపు..
కొత్తపల్లిలో సర్పంచ్ కోమటిరెడ్డి లలిత ఆధ్వర్యంలో గ్రామం నుంచి శివారు దాకా రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు, చెత్తను ఉపాధి కూలీలు తొలగించారు. మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టారు. ఇక్కడ ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ఉప సర్పంచ్ అజ్మీరా రవి నాయక్, పంచాయతీ కార్యదర్శి రమేశ్, వార్డు సభ్యులు, జీపీ కో ఆప్షన్ సభ్యులు కారోబార్ రవి కిరణ్, అంగన్వాడీ టీచర్లు మంగారాణి, రేణుక తదితరులు పాల్గొన్నారు.
ఎలిగేడు, జూలై 4: ర్యాకల్‌దేవ్‌పల్లిలో పల్లె ప్రగతి, హరితహారంలో ఎమ్మెల్యే దాసరి పాల్గొని పనులను పరిశీలించారు. తడిపొడి చెత్తను వేరుచూసే విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ చేశారు. అలాగే ధూళికట్ట, సుల్తాన్‌పూర్‌లో పనులను డీపీవో చంద్రమౌళి, డీఎల్పీవో దేవకీదేవి పరిశీలించారు. ఇక్కడ జడ్పీ వైస్ చైర్పర్సన్ మండిగ రేణుక, ఎంపీపీ తానిపర్తి స్రవంతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, మండల ప్రత్యేకాధికారి తిరుపతిరావు, ఎంపీడీవో, ఎంపీవో, పీఆర్ ఏఈ శ్రీనివాసమూర్తి, అనిల్‌రెడ్డి, జగదీశ్వర్, సర్పంచ్ విజేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ బొడిగె అనిల్‌కుమార్‌గౌడ్, సెర్ఫ్, ఈజీఎస్ అధికారులు సుధాకర్, సదానందం, ధూళికట్ట, సుల్తాన్పూర్ సర్పంచులు గొల్లె కావేరి, అర్శనపల్లి వెంకటేశ్వరరావు తదితరులున్నారు.
రామగిరి, జూలై 4 : బేగంపేట ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ దవాఖాన ఆవరణ, గ్రామంలోని మురుగుకాలువలను శుభ్రం చేయించారు. నాగేపల్లిలోని పలు వాడల్లో ముళ్ల పొదలు, పిచ్చి మొక్కులు తొలగించి, పారిశుధ్య పనులు చేపట్టారు. పన్నూర్‌లో రోడ్లను శుభ్రం చేశారు. రత్నాపూర్లో మురుగు కాలువలను శుభ్రం చేసి, చెత్తను డంప్ యార్డ్‌కు తరలించారు. కార్యక్రమాల్లో సర్పంచులు బుర్ర పద్మ, అల్లం పద్మ, పల్లె ప్రతిమ, రామగిరి లావణ్య, దాసరి లక్ష్మి, కొండవేన ఓదెలు, కార్యదర్శులు పరశురాం, ఉప్పులేటి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
కాల్వశ్రీరాంపూర్, జూలై 4: ఇద్లాపూర్, పెద్దరాత్పల్లి, జాఫర్‌ఖాన్‌పేటలో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించారు. ఇద్లాపూర్లో నూతనంగా నిర్మిస్తున్న సైడ్ డ్రైనేజీ పనులు పరిశీలించారు. రహదారుల వెంట ఉన్న చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు తొలగింపజేసి, పారిశుధ్యంపై ప్రజలకు వివరించారు. ఆయా గ్రామాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో ఎంపీపీ నూనేటి సంపత్, డీఏవో తిరుమల్‌ప్రసాద్, ఎంపీడీవో కిషన్, సర్పంచులు దొంతరవేన రజిత, దొమ్మటి శ్రీనివాస్, ఓరుగంటి కొమురయ్య, ఎంపీవో గోవర్ధన్, ఏపీవో మంజుల పాల్గొన్నారు.