కోల్‌సిటీ, జూలై 4: రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో పట్టణ ప్రగతి అట్టహాసంగా కొనసాగుతున్నది. ఆదివారం సెలవు దినమైనా ఆయా డివిజన్లలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మేయర్ అనిల్‌కుమార్, కమిషనర్ పీ ఉదయ్ కుమార్ ఆదేశాల మేరకు డ్రై డేగా పాటించారు. ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు 12వ డివిజన్లో కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ ఆధ్వర్యంలో పరిసరాలను శుభ్రం చేశారు. వార్డు ఆఫీసర్ రమ్యతో కలిసి డివిజన్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఇక్కడ ఆర్పీ సునీత, శనిగరపు శేఖర్, వెంకటేశ్, సంపత్ రెడ్డి, మధుకర్ రెడ్డి, రమేశ్, దాసరి ప్రవీణ్, సాయి, యూనస్, రాజేశ్వరి, రజిత, స్వరూప, సైదక్క ఉన్నారు. అలాగే 13వ డివిజన్ పరిధి విఠల్‌నగర్‌లో కార్పొరేటర్ రాకం లత దామోదర్ ఆధ్వర్యంలో డ్రైడే గా పాటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాకం లత బస్తీలోని ఇండ్ల వద్దకు వెళ్లి కూలర్లు, గోళాల్లో నిల్వ ఉన్న నీటిని పారబోసి ప్రజలకు అవగాహన కల్పించారు. హరితహారంలో భాగంగా కాలనీలోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటారు. ఇక్కడ వార్డు ఆఫీసర్ దాసరి శ్రీనివాస్, సూపర్వైజర్ ఆడెపు శ్రీనివాస్, అఖిల్ ఉన్నారు. అలాగే 6వ డివిజన్ సప్తగిరి కాలనీలో ఇంటింటికీ 6 మొక్కల చొప్పున కార్పొరేటర్ స్వరూప పంపిణీ చేశారు.
విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు
మంథని టౌన్, జూలై 4: విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ తెలిపారు. 2వ వార్డులో పట్టణ ప్రగతిలో భాగం గా ఆదివారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులతో రోడ్లను శుభ్రం చేయించడంతో పాటు చెత్తాచెదారాన్ని తొలగింపజేశారు. అనంతరం ముత్యాలమ్మవీధిలో విద్యు త్ స్తంభాలు ఒరిగి ఉండడం, తీగలు జామ్కావడంలాంటి అంశాలను విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా వివరించారు. సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఆమె వెంట వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్ పాల్గొన్నారు.
అలాగే 7వ వార్డులో వార్డు కౌన్సిలర్ గర్రెపల్లి సత్యనారాయణ, అధికారులు పర్యటిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వార్డులో లూజ్ వైర్లు, ఇనుప స్తంభాలను పరిశీలించారు. అలాగే ఆయా వార్డుల్లో కౌన్సిలర్లు వీకే రవి, నక్క నాగేంద్రశంకర్, గుండా విజయ లక్ష్మీపాపారావు, కొట్టే పద్మ రమేశ్ పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.
కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
తన ఇంటి ఆవరణ, పరిసరాల్లో అత్యధికంగా మొక్కలు నాటి వాటి రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ప్రకృతి ప్రేమికుడు గట్టు కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ సూచించారు. శ్రీ మహాలక్ష్మీ ఆలయ సమీపంలో గట్టు కృష్ణమూర్తి అత్యధికంగా మొక్కలు నాటడంతోపాటు వాటిని రక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుండగా ఆయనను పుట్ట శైలజ శాలువాతో సన్మానించారు. మొక్కను బహుమతిగా అందజేశారు. మంథనికి చెందిన పెద్దిరాజు పురుషోత్తం సైతం మంథనిలో నాటేందుకు అనేక మొక్కలను అందజేయడంతో పాటు కుండీలను సైతం అందజేశారని, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, వార్డు కౌన్సిలర్ చొప్పకట్ల హన్మంతరావు, మహాలక్ష్మీ ఆలయ కమిటీ చైర్మన్ మారుపాక చంద్రకళ రమేశ్, కొమురవెల్లి కృష్ణమూర్తి, రాధాకిషన్, వార్డు ఇన్చార్జి ఫణిచంద్ర ఉన్నారు.
పండ్ల మొక్కల పంపిణీ
జ్యోతినగర్(రామగుండం), జూలై 4: హరిత హారంలో భాగంగా రామగుండం 22వ డివి జన్‌లో కార్పొరేటర్ కౌశిక లత పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఇందిరానగర్‌లో మహిళా గ్రూపు సభ్యులకు కార్పొరేటర్ పండ్లు, పూల మొక్కలను అందజేశారు.
పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
పెద్దపల్లిటౌన్, జూలై 4: పరిశుభ్రతకు అం దరూ ప్రాధాన్యం ఇవ్వాలని కమిషనర్ తిరుపతి సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఆయా వార్డుల్లోని మురుగు కాల్వల్లోని సిల్ట్, పిచ్చి మొక్కలను తొలగించారు.