Julapally | జూలపల్లి, జనవరి 2 : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో శుక్రవారం డిప్యూటీ కలెక్టర్ బానావత్ వనజను స్థానిక పంచాయతీ పాలకవర్గం సభ్యులు సన్మానించారు. వనజ గ్రూప్-1 పోటీ పరీక్షలు రాసి డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికయ్యారు. ఈ క్రమంలో శిక్షణలో భాగంగా జూలపల్లి తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ పాటకుల అనూషతో పాటు వార్డు సభ్యులు కలిసి వనజకు శాలువా కప్పి అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ పాటకుల అనిల్, పంచాయతీ కార్యదర్శి లచ్చయ్య, ఉప సర్పంచ్ కొప్పుల మహేష్, వార్డు సభ్యులు గీస స్వప్న, నగునూరి వనిత, మేర శ్రీనివాస్, అంకూస్ తదితరులు పాల్గొన్నారు.