Peaceful bandh | రుద్రంగి, ఏప్రిల్ 26: జమ్మూ కాశ్మీర్ పహల్గంలో ఉగ్రవాదులు అమాయక హిందువులను, టూరిస్టులను కాల్చి చంపడాన్నీ ఖండిస్తూ మృతి చెందిన వారికి సంఘీభావంగా హిందూ సంఘాలు, హిందు ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం రుద్రంగి బందుకు పిలుపునిచ్చాయి. కాగా ఈ బంద్ శాంతియుతంగా సాగగా వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బందు పాటించారు.
హిందూ సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి చనిపోయిన వారికి నివాళులర్పిస్తూ పాకిస్తాన్ డౌన్ డౌన్ ఉగ్రవాదం నశించాలంటూ నినాదాలు చేస్తూ పాకిస్తాన్ జెండాలను దహనం చేశారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉగ్రవాద మారణకాండ యావతు ప్రపంచ మానవతావాదుల్ని కలచి వేసిందన్నారు. దేశంలో మత పరమైన అల్లర్లు సృష్టించడం కోసం ఇలాంటి దాడులు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయనికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. దేశ భద్రత విషయంలో అందరూ ఒకే మాట పై ఉండాలని ఎవరైనా రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గంగం మహేష్, నంద్యాడపు వెంకటేష్, దయ్యాల కమలాకర్, కంటే రెడ్డి, పడాల గణేష్, గెంటే ప్రశాంత్, బోయిని రాజు, ఇప్ప మహేష్, మీసాల రవీందర్, వేణు, బాల కిషన్ రావు, రవి, బోయ నర్సారెడ్డి, పడాల గజనంద్ నాయకులు పాల్గొన్నారు.