Karate Referee Judge | కోల్ సిటీ, జనవరి 20: కరాటే రిఫరీ జడ్జిగా గోదావరిఖనికి చెందిన సీనియర్ కరాటే మాస్టర్ పసునూటి చందర్ ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో గల ఇండోర్ స్టేడియంలో ఈనెల 18న కరాటే ఇండియా ఆర్గనైజేషన్, తెలంగాణ స్పోర్ట్స్ కరాటే డూ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే రిఫరీ జడ్జ్ ఎక్సమినేషన్ సెమినార్ లో గోదావరిఖనికి చెందిన డ్రాగన్ షాటోకాన్ కరాటే క్లబ్ కరాటే మాస్టర్ పసుసూటి చందర్ గ్రేడ్-ఏ ఉత్తీర్ణత సాధించారు.
దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి కరాటే క్రీడాకారులు, శిక్షకులు, రిఫరీ అభ్యర్థులు ఈ సెమినార్లో పాల్గొనగా చందర్ తన ప్రతిభ చాటుకున్నాడు. గ్రేడ్ 1 ఉత్తీర్ణత సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా కరాటే ఎఫ్.కే.ఏ ఇండియా చీఫ్ శ్రీనుబాబు, భవాని చంద్, ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ ఆరుముళ్ల పవన్, జిల్లా కరాటే స్పోర్ట్స్ డూ మాస్టర్స్ పసునూటి శంకర్, కరాటే శ్రీనివాస్, ఫీజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఉమ్మడి జిల్లా కో- ఆర్డినేటర్ తగరం శంకర్, ఒడ్డెపల్లి సురేశ్, నాగరాజు తదితరులు చందర్ ను ప్రత్యేకంగా అభినందించారు.