Godavarikhani \ కోల్ సిటీ, మే 23: గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన రామిళ్ల రామలింగం-మంగళ దంపతులు తమ కుమారుల జ్ఞాపకార్థం అనాథ పిల్లలు, నిరాశ్రయులకు శనివారం అన్నదానం చేశారు. స్థానిక విఠల్ నగర్ లో గల అమ్మ పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంను వారు సందర్శించారు. ఆశ్రమంలోని పిల్లలు, వృద్ధులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఒకరోజు అన్నదానం చేశారు. కాగా, చెట్టంత ఎదిగిన ఇద్దరు కొడుకులు కరోనా విపత్తు సమయంలో వారం వ్యవధిలోనే చనిపోయారు.
అప్పటి నుంచి తమ కుమారుల జ్ఞాపకాలతో గడుపుతున్న రామిళ్ల దంపతులు ప్రతీ ఏటా వారి జ్ఞాపకార్థం సమాజ హిత కార్యక్రమాలు చేపడుతున్నారు. గుండెల్లో అంత దుఃఖంను దిగమింగుకొని విషాదంలోనూ ఇతర అనాథ పిల్లల ఆకలి గురించి ఆలోచించడం పట్ల రామిళ్ల దంపతులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు శైలజ, వైష్ణవి, వణుష్ట, రాజేంద్రకుమార్, జ్యోతి, విశ్వజిత్, నిత్యసాయి, మహేంద్రకుమార్, సుప్రియ, కృతిక్, రవీంద్రకుమార్, గురుపాదం, మిత్రులు మేజిక్ రాజా, హరి, చంద్రపాల్, ఆశ్రమ నిర్వాహకులు నాగరాజు, కరణ్ తదితరులు పాల్గొన్నారు.