Manthani | మంథని రూరల్: తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే జీవితంలో విజయం సాధించవచ్చని ట్రైనీ ఎస్సై దివ్య అన్నారు. మంథని మండలం బెస్తపల్లి గ్రామం నుండి ఎస్సైగా ఎంపికైన సాకపురం దివ్యను బెస్తపల్లి గంగపుత్ర సంఘం నాయకులు మంగళవారం ఘనంగా శాలువాతో సన్మానించి సత్కరించారు. గంగపుత్ర కులదైవం గంగాదేవి అమ్మవారి దర్శనం నిమిత్తం ఆమె స్వగ్రామానికి రాగా, గ్రామస్తులు ఆమెను సత్కరించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ భూపాలపల్లిలో విధులు నిర్వహిస్తున్నాని, జీవితంలో లక్ష్యం ఏర్పరచుకొని దానికి అనుగుణంగా కష్టపడితే విజయం సాధించవచ్చని ఆమె తెలిపారు. తన విజయం వెనుక తల్లిదండ్రులు శ్రీనివాస్, రమాదేవి, తన కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సహకారం మరువలేనిదని ఆమె తెలిపారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా జీవితంలో ముందుకెళ్లాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గుమ్ముల లక్ష్మీనారాయణ, తోకల రమేష్, గుమ్ముల సాగర్, మేడి లక్ష్మణ్, ధర్మాజి హనుమంతు,గుమ్ముల చిన్న రాజేశం, సంపత్, కమలేష్, సాయికుమార్, సతీష్, అశోక్, సంతోష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.