Padi Puja | ధర్మారం, డిసెంబర్ 25: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నేత, ఆర్బీఎస్ జిల్లా మాజీ సభ్యుడు పూస్కురు రామారావు స్వగృహంలో గురువారం పడి (మెట్ల) పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. రామారావు సోదరుడు పూస్కురు శ్రీకాంత్ రావు-జానకీ దంపతుల ఆధ్వర్యంలో ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి ఆలయ అర్చకుడు నర్సింగరావు నేతృత్వంలో పూజ కార్యక్రమాలను నిర్వహించారు. మొదట శ్రీ అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకం చేశారు.
అనంతరం పడిపూజ కోసం 18 మెట్లను అలంకరించారు. అనంతరం పడిపూజ తరహాలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామిని కీర్తిస్తూ అయ్యప్ప దీక్ష సాములు చేసిన సంకీర్తనలు, భజనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రత్యేక పూజల అనంతరం అర్చకుడు నర్సింగరావు గీతాలాపన తో పడిపూజ కార్యక్రమాన్ని కన్నుల పండువగగా నిర్వహించారు. నిర్వాహకులైన పూస్కురు శ్రీనాథరావు – జానకి దంపతులు వారి కుమారుడు సంజు తో కలిసి 18 మెట్ల పై దీపాలంకరణ చేశారు.
ఈ సందర్భంగా వారు అయ్యప్ప గురుస్వాములను, కన్నె స్వాములను శ్రీనాథరావు సన్మానించారు. ఆ తర్వాత దీక్ష స్వాములకు, అయ్యప్ప భక్తులకు భిక్ష పెట్టారు. ఈ కార్యక్రమంలో రామారావు సతీమణి రమాదేవి, మాజీ జెడ్పీటీసీ పద్మజ, మాజీ సర్పంచ్ జితేందర్ రావు, మాజీ ఉపసర్పంచ్ ఆవుల లత, ఏఎంసీ డైరెక్టర్లు కాంపల్లి రాజేశం, ఈదుల శ్రీనివాస్, నూతన ఉపసర్పంచ్ ఎలిగేటి మల్లేశం, వార్డు సభ్యులు కాంపల్లి రత్నకుమారి, బొమ్మగాని సతీష్, నూనె గణేష్, సాద మౌనిక వెంకటేష్ ఉప్పరి శ్రావణి సతీష్, అర్ధవెల్లి రజిత, బీఆర్ఎస్ మహిళా నాయకురాలు కాంపల్లి అపర్ణ, మాజీ ఎంపీటీసీ తోడేటి రాజ లింగయ్య, మాజీ ఉపసర్పంచ్ సలాది చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.