Thimmapur | తిమ్మాపూర్ రూరల్, ఆగస్ట్ 15 : యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తిమ్మాపూర్ తహసీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డి సూచించారు. 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రామక్రిష్ణకాలనీ లో గ్రామస్థాయి వాలీ బాల్ టోర్నమెంట్ నిర్వహించారు.
ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తహసీల్దార్ మాట్లాడుతూ సెల్ ఫోన్ లకు అతుక్కుపోయి సమయం వృథా చేసుకోవద్దని, క్రీడలతో శారీరక ధారుడ్యం పెంపొందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రేవెల్లి రవి, భూతం శ్రీకాంత్, భూతం రాకేష్, కళ్లెం అజయ్, కిన్నెర శ్రీనివాస్ ను తహసీల్దార్ అభినందించారు.