Jagtial | మహోన్నత విలువలను ఆచరిస్తూ సమాజానికి ఆదర్శంగా ఉండాలి : అదనపు కలెక్టర్ బి. ఎస్.లత
Jagtial | ధర్మం. అహింస, సమానత్వం వంటి మహోన్నత విలువలను ఆచరిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలువాలని అదనపు కలెక్టర్ బి. ఎస్.లత అన్నారు.
జగిత్యాల : ధర్మం. అహింస, సమానత్వం వంటి మహోన్నత విలువలను ఆచరిస్తూ సమాజానికి ఆదర్శంగా ( Role Model ) నిలువాలని అదనపు కలెక్టర్ బి. ఎస్.లత (B.S. Latha) అన్నారు. వాసవీ మాత జయంతి వేడుకల సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా యువజన , క్రీడల శాఖ ఆధ్వర్యంలో వాసవీ మాత జయంతిని ( Vasavi Matha Jayanthi ) ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాసవీ మాత చూపించిన సత్య మార్గంలో నడుస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించాలని కోరారు. ప్రతి ఏటా వైశాఖ శుక్ల పక్ష దశమి రోజున వాసవీ మాత జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రవికుమార్ , వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, సంఘ ప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.
పల్లకిని మోసిన ఎమ్మెల్యే
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లకి సేవా కార్యక్రమంలో జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ పాల్గొని పల్లకిని మోసారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ బండ శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ గోలి శ్రీనివాస్, వైశ్య సంఘం అధ్యక్షుడు నవీన్, ప్రధాన కార్యదర్శి బోడ్ల జగదీష్, కోశాధికారి శ్రీనివాస్ ఆలయ ఛైర్మెన్ రాజేందర్, ఏఎంసీ డైరెక్టర్ రమేష్, అరవింద్, సంతోష్, సునీల్, వైశ్య సంఘం సభ్యులు, వాసవి మాత భక్తులు,
తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

