వేములవాడ : సిరిసిల్ల జిల్లా ( Siricilla District ) వేములవాడ పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో ఒకరు మృతి చెందగా మరో 20 మందికి గాయాలయ్యాయి . 23 మంది మహారాష్ట్ర కూలీలతో బయలుదేరిన ఆటోను
ఆర్టీసీ బస్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
బోయినపల్లి మండలం వరదవెల్లి వద్ద పనులు ముగించుకొని తంగేళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి బయలు దేరిన కూలీల ఆటోను నాంపల్లి శివారు వద్ద వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా, గాయపడ్డ క్షతగాత్రులను వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.