Huzurabad | హుజురాబాద్, సెప్టెంబర్ 1 : వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్లు రైతులకు అందుబాటులో ఉంటూ సాగులో తగు సూచనలు అందించాలని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్ ఆదేశించారు. హుజురాబాద్ పట్టణంలోని కేసీ క్యాంపులో గల రైతు వేదికలో మంగళవారం రైతు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు.
ప్రతీ మంగళవారం జరిగే రైతునేస్తం కార్యక్రమానికి రైతులు హాజరయ్యే వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏడీఏ సునీత, వ్యవసాయ శాఖ అధికారులు భూమిరెడ్డి, ఖాదర్ హుస్సేన్, ఏఈవోలు, డీలర్లు, రైతులు పాల్గొన్నారు.