NSS Camp | పెద్దపల్లి రూరల్, జనవరి 5 : ఎన్ఎస్ఎస్ శిబిరాలతో విద్యార్థులు సేవా దృక్పథం పెంపొందించుకునే అవకాశం లభిస్తుందని రంగాపూర్ గ్రామ సర్పంచ్ గంట రమేష్ అన్నారు. పెద్దపల్లి మండలంలోని రంగాపూర్ లో సోమవారం గాయత్రి డిగ్రీ&పీజీ కళాశాల NSS ప్రత్యేక శిబిరాన్ని సర్పంచ్, గాయత్రి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ అల్లెంకీ శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. గాయత్రి డిగ్రీ &పీజీ కళాశాల కు చెందిన 50 మంది వాలెంటీర్స్ తో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో మొదటి రోజు ముఖ్య అతిథిగా హాజరై సర్పంచ్ గంట రమేష్ ప్రారంభం చేసి శ్రమదానం చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను విద్యార్థి దశ నుండే సమాజసేవ నేర్చుకోవాలని, చదువు పరమార్థం ఏమిటంటే చదువుతోపాటు సమాజాన్నిచదవాలని, ఏలాంటి లాభపాక్షి లేకుండా చేయడమే సమాజ సేవ అని అన్నారు. మధ్యాహ్నం జడ్పీహెచ్ఎస్ అవరణలో కలుపు మొక్కలు తీయడం, పరిసరాలను శుభ్రం చేశారు.
యువత వ్యసనాలకు బానిస కావొద్దని మొబైల్ ఫోన్ వాడకం తగ్గించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండ శ్రవణ్ పంచాయతీ కార్యదర్శి గుమ్మడి సదయ్య, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి సమద్, అధ్యాపకులు స్వామి, వార్డు సభ్యులు ఈర్ల వెన్నెల సంతు, గంట శ్రీనివాస్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.