పెద్దపల్లి, మే15 : ఏప్రిల్‌కు సంబంధించి అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ డి విజనల్ ఇంజినీర్, డివిజనల్ ఇంజినీర్, సూపరింటెండెంట్ ఇంజినీర్ (సబ్ డివిజన్, డివిజన్, సరిల్) పూర్తి చేసిన పని, అన్ని రకాల పనులపై సాధించిన ప్రగతి ని దృష్టిలో ఉంచుకొని ఎన్పీడీసీఎల్ ప రిధిలోని 16సరిళ్లకు సంస్థ చైర్మన్ అం డ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి ర్యాంకులు ప్రకటించారు. అందులో పె ద్దపల్లి సర్కిల్‌కు ప్రథమ స్థానం వచ్చిందని పెద్దపల్లి సూపరింటెండెంట్ ఇంజినీర్ సుదర్శనం తెలిపారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు.
కంపెనీలోని 16 సరిళ్లలో పెద్దపెల్లి జిల్లాకు ప్రథమ ర్యాంకు వచ్చిందని, అసిస్టెంట్ ఇంజినీర్లలో సైఫుద్దీన్ కాట్నపల్లి (సుల్తానాబాద్) ప్రథమ ర్యాంక్, సబ్ డివిజన్ విభాగంలో సుల్తానాబాద్‌కు 2వ ర్యాంకు, గో దావరిఖని సబ్ డివిజన్‌కు 3వ ర్యాంకు, డివిజన్ విభాగంలో పెద్దపల్లి డివిజన్‌కు 2వ ర్యాంకు, మంథని డివిజన్‌కు 3వ ర్యాంకు వచ్చినట్లు తెలిపారు. ఆపరేషన్ మెయింటనెన్స్ స్టాఫ్నుంచి ఫోర్‌మెన్ వరకు, అసిస్టెంట్ ఇంజినీర్లు, సబ్ ఇంజినీర్ నుంచి డివిజన్ ఇంజినీర్ వరకు, సీ నియర్ అకౌంట్ ఆఫీసర్లు, అకౌంట్ ఆఫీసర్లు, జూనియర్ అసిస్టెంట్ నుంచి అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ వరకు ప్రతి ఒకరూ కష్టపడి పనిచేయడం వల్ల పెద్దపల్లి జిల్లా కంపెనీలో ప్రథమ స్థానం సా ధించిందన్నారు.
మేలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల విద్యుత్ వినియోగం పోయిన సంవత్సరం కంటే అదనంగా డిమాండ్ ఉన్నప్పటికీ అవాంతరాలు లేకుండా విద్యుత్ సరఫరా వినియోగదారులకు అందజేస్తున్నామన్నారు. గృహావసరాలకు, వాణిజ్యపరంగా కొత్త కనెక్షన్ కావలసినవారు దగ్గరలోని మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని, వారికి వెంటనే కరెంట్ కనెక్షన్ ఇస్తామని, వ్యవసాయ బావులకు కూడా కా వాల్సిన వారికి యుద్ధ ప్రాతిపదికన కనెక్షన్ అందజేస్తామని తెలిపారు.