NIA Raids | జ్యోతినగర్ (రామగుండం), ఆగస్టు 24 : అహ్మదాబాద్ సైబర్ టెర్రరిజం కేసుకు సంబంధించి 2025లో నమోదైన సైబర్ టెర్రరిజం కేసులో భాగంగా తెలంగాణలో ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) చేపడుతున్న దాడుల నేపధ్యంలో సోమవారం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్ఐఏ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి ఐదుగురు అధికారుల బృందం దాడులు నిర్వహించింది. రామగుండం మండల కేంద్రంలోని అయోధ్యనగర్‌కు ఓ వైద్యుడి కుమారుడైన ముజామిలాఖాన్ ఇంట్లోకి ఉదయం ప్రవేశించిన ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాదులతో సంబంధాలు, సైబర్ నేరాల్లో ప్రమేయం ఉందన్న అనుమానంతో దాదాపు నాలుగు గంటల పాటు ప్రశ్నలతో ముజామిల్ వైఖాన్ విచారించారు.
అతడి టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూపు సభ్యుల వివరాలు, వారి మధ్య చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై జరిగిన సంభాషణలు, ముజామిలాఖాన్ ఉన్న సంబంధాలపై సమాచారంతోనే గుజరాత్ నుంచి ఎన్ఐఏ అధికారులు, సైబరైమ్ అధికారులు ఇంట్లోకి రంగ ప్రవేశం చేసి తనిఖీలతో ఆరా తీశారు. ముజామిలాఖాన్ సంబంధించిన ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను సీజ్ చేసిన ఎన్ఐఏ అధికారులు సెప్టెంబర్ 15వ తేదిన సికింద్రాబాద్‌లోని ఎన్ఐఏ కార్యాలయంకు విచారణకు రావాలని నోటీసు అందజేశారు. అయితే ముజమిల్‌ఖాన్ పెద్దపల్లి ట్రినిటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి. వాట్సాప్ గ్రూప్‌లో యాడ్‌తో ఉపయోకరంగా లేకపోవడం, గ్రూప్‌లో సైబర్ నేరంతో ఏడాది క్రితమే గ్రూప్ నుంచి లెఫ్ట్ అవడంతోనే తనపై అనుమానంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు ముజామిలాఖాన్ తెలిపారు. ఉగ్రవాగ లింకులు, సైబర్ నేరాల్లో ప్రమోయంగా ఎన్ఐఏ అధికారులు జరిపిన ఈ దాడులతో రామగుండం పట్టణం భయందోళనకు గురైంది.