కార్పొరేషన్/కమాన్‌చౌరస్తా/తెలంగాణచౌక్/హుజూరాబాద్ టౌన్/ జమ్మికుంట/ మానకొండూర్ రూరల్/ చొప్పదండి(రామడుగు)/ గన్నేరువరం/ తిమ్మాపూర్/ వీణవంక/శంకరపట్నం, జనవరి 1: జిల్లా వ్యాప్తంగా సోమవారం నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచే ప్రజలు కేక్‌లు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి కనిపించింది. నూతన సంవత్సరంలో గతేడాడి చేదు అనుభవాలు తొలిగి సుఖ సంతోషాలు కలుగాలని తమ ఇష్ట దైవాలను ప్రార్థించుకున్నారు. ఇళ్ల ముందు మహిళలు, యువతులు రంగవల్లులు వేశారు.
విద్యాసంస్థ ల్లో విద్యార్థులు ఆడి పాడారు. సాన్వి డిఫెన్స్ అకాడమీ, పారమిత విద్యాసంస్థల్లో న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. సోమ వారం సాయంత్రం సమయంలో డీర్‌పార్క్, ఉజ్వల పార్, మానేరు డ్యాం, తీగలవంతెన వద్ద జనం సందడి కనిపించింది. ప్రజాప్రతినిధులు, నేతలకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మేయర్ సునీల్ రావుకు ఆయన క్యాంపు కార్యాలయంలో బ్ర హ్మకుమారీలు ప్రత్యేక క్యాలెండర్ అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి, పీఆర్టీయూ నా యకులు కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపా రు. జిల్లాలోని పలు చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నగరంలోని సీఎస్ఐ వెస్లీ కెథడ్రిల్ చర్చిలో బిషప్ డాక్టర్ కె రూబెన్మార్ ప్రత్యేక సందేశమిచ్చి ప్రార్థనలు చేయించారు.
క్వాయర్స్ బృందం గీతాలు అలరించాయి. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. కరీంనగర్ భగత్‌నగర్‌లోని మేయర్ క్యాంపు కార్యాలయంలో నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చాడగోండ బుచ్చిరెడ్డి, సరిళ్ల ప్రసాద్, నాయకులు మెండి చంద్రశేఖర్, బాలయ్య, మహేశ్ పాల్గొన్నారు. ఆర్టీసీ ఈడీ కార్యాలయంలో ఈడీ వినోద్‌కుమార్ కేక్ కట్ చేసి, అధికారులు, సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎంలు భూపతిరెడ్డి, సత్యనారాయణ, డీఏలు మల్లయ్య, మల్లేశం, స్టేషన్ మేనేజర్ అంజయ్య ఉన్నారు. హుజూరాబాద్‌లో ఆదివారం అర్ధరాత్రి అంబేద్కర్ చౌరస్తాలో టౌన్ సీఐ బొల్లం రమేశ్ కేక్ కట్ చేశారు.
పట్టణంలో సోమవారం పలు చోట్ల జరిగిన వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, వైస్‌చైర్‌పర్సన్ కొలిపాక నిర్మలాశ్రీనివాస్ పాల్గొని కేక్ కట్ చేశారు. హుజూరాబాద్ మండలం రంగాపూర్ కల్వరి టెంపుల్ చర్చిలో ఫాదర్ నెల్సన్-సుదిన దంపతులు కేక్ కట్ చేసి, స్వీట్స్ పంచారు. జమ్మికుంట వాకర్స్ అసోసియేషన్స్ అధ్యక్షుడు సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు కేక్ కట్ చేశారు. మానకొండూర్ మండలం గంగిపల్లిలో కరీంనగర్ కార్పొరేటర్ వాల రమణారావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు.
నూతన సంవత్సరం సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావును మండలంలోని పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో బీఆర్ఎస్ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్, యూత్ మండలాధ్యక్షుడు ఆరపెల్లి ప్రశాంత్, నాయకులు తదితరులున్నారు. వీణవంక మండలంలో జరిగిన వేడుకల్లో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.