చల్లూరు పీహెచ్‌సీపై నిర్లక్ష్యం బాధాకరం
ఉత్తమ సేవలతో చల్లూరు పీహెచ్సీ మూడు సార్లు అవార్డులు సాధించిందని, అలాంటి దవాఖాన ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురికావడం బాధాకరమని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ అరకొర సిబ్బందితో పూర్తి స్థాయిలో వైద్యం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీణవంక మండలం చల్లూరు గ్రామస్తులు పీహెచ్సీలో సరైన వైద్యం అందడంలేదని ఫిర్యాదు చేయగా, శుక్రవారం ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
- ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
వీణవంక, జూలై 10 : ఉత్తమ సేవలతో చల్లూరు పీహెచ్సీ మూడు సార్లు అవార్డులు సాధించిందని, అలాంటి దవాఖాన ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురికావడం బాధాకరమని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ అరకొర సిబ్బందితో పూర్తి స్థాయిలో వైద్యం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీణవంక మండలం చల్లూరు గ్రామస్తులు పీహెచ్సీలో సరైన వైద్యం అందడంలేదని ఫిర్యాదు చేయగా, శుక్రవారం ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా దవాఖానలో ఓపీ రిజిస్టర్, మెడికల్ షాపు, ల్యాబ్, తదితర విభాగాలను పరిశీలించి, డాక్టర్ సంతోష్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, దవాఖానకు మొత్తం 12 పోస్టులు మంజూరై ఉన్నా.. అందులో ఆరుగురు డిప్యుటేషన్‌పై వెళ్లిపోయారన్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో వెంకటరమణతో ఫోన్లో మాట్లాడి, డిప్యుటేషన్‌పై వెళ్లిన సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వాల బాలకిషన్‌రావు, మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, సర్పంచ్ సంపత్‌రెడ్డి, ఉపసర్పంచ్ ఫసియొద్దీన్ ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

